News January 30, 2025
మ్ముమిడివరం: ‘ఈవీఎం, వీవీ ప్యాడ్లకు పటిష్ట భద్రత’

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు, వివి ప్యాడ్ లకు పటిష్ట భద్రత చేకూర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కార్యనిర్వాహక అధికారి తాతబ్బాయి అన్నారు. గురువారం ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాలలో మూడో అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను ఆయన తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్ రాజకుమారితో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ గూర్చి అధికారులతో చర్చించారు.
Similar News
News July 7, 2025
యాదాద్రి: మహిళలకు అబార్షన్.. పోలీసుల అదుపులో వైద్యుడు

భువనగిరి గాయత్రి ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన ఓ డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు SI కుమారస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి హాస్పిటల్‌కు వెళ్లి తనిఖీ చేయగా మహిళలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్లో ఉంచగా, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ చేసిన మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మహిళలు ఇద్దరు యాదాద్రి జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.
News July 7, 2025
KU పరిధిలో 2,356 సీట్లు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.
News July 7, 2025
20 నుంచి కడపలో రక్తదాన శిబిరాలు

రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణ పోయవచ్చని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో రక్తదాన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కడపలోని రెడ్‌క్రాస్ కార్యాలయం, రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణాల్లో జులై 20 నుంచి 26వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయాలని కోరారు.