News January 30, 2025

విశాఖ జిల్లాలో ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 23 బృందాలు

image

విశాఖ జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు చర్య‌లు తీసుకున్నామ‌ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. వివిధ స్థాయి అధికారుల‌తో కూడిన‌ 12 ఎంసీసీ బృందాల‌ను నియ‌మించామ‌న్నారు. మండ‌లానికి ఒక‌టి చొప్పున‌ 11ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. జీవీఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్, జ‌డ్పీ సీఈవో, భీమిలి, విశాఖ‌ ఆర్డీవోల‌ను నోడ‌ల్ అధికారులుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు.

Similar News

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

image

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.

News September 16, 2025

ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.