News January 30, 2025

జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: కాటసాని

image

గత ప్రభుత్వ హయాంలో తమ అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని YCP నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా.. ప్రజలు తమపై విశ్వసనీయత కోల్పోకూడదని ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోను జగన్ అమలు చేశారన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న CBN.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసే ఎలా హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.

Similar News

News September 18, 2025

మంచిర్యాలలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు ఏసీపీ ప్రకాశ్ ఆదేశాలతో సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతి గురువారం సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఓ ఇంట్లో బాదే రాజమణి, సమీల రాకేశ్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, వారితోపాటు విటులు కొండ విజయ్, కావేటి సురేశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News September 18, 2025

చిమ్మిరిబండలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

మార్టూరు మండలం చిమ్మిరిబండ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు గురై దుడ్డు కొర్నేలు వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆయన పొలంలో పనిచేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అతనిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పశు కాపర్లు గమనించి VROకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మృతుడి వివరాలు సేకరించి మార్టూరు తహశీల్దార్ ప్రశాంతికి నివేదిక అందించారు.

News September 18, 2025

శ్రీశైలంలో దసరా ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

శ్రీశైలంలో ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తూ గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్దా రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శ్రీనివాసరావు, టీడీపీ ఇన్‌ఛార్జ్ యుగంధర్ రెడ్డి తదితరులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రికతో పాటు మల్లన్న ప్రసాదాన్ని అందజేశారు.