News January 30, 2025
టెన్త్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలి: డీఈవో

జిన్నారం మండలంలోని పాఠశాలలను డీఈవో వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. గడ్డపోతారం మున్సిపాలిటీలోని కాజిపల్లి, వావిలాల ఉన్నత పాఠశాలతో పాటు, జిన్నారంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రానున్న టెన్త్ పరీక్షలకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
Similar News
News July 7, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిరప మార్కెట్‌లో సోమవారం 20 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఏ/సీ సరుకు సంఖ్య 60 వేలుగా నమోదైంది. తాజా ధరల ప్రకారం తేజా ఏ/సి రూ.120-132, 355 ఏ/సి రూ.100-125, 2043 ఏ/సి రూ.120-130, 341 ఏ/సి రూ.120-135, నంబర్ 5 ఏ/సి రూ.125-135 ఉండగా, సీజెంటా, డీడీ, రోమి-26, బంగారం రకాల ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నాటు 334, సూపర్ టెన్ రకాలు రూ.80-130 వరకు ఉన్నాయి. తాలుకూ ధరలు రూ.35-70 మధ్య ఉన్నాయి.
News July 7, 2025
జిల్లాలో ఎరువులు కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు సోమవారం తెలిపారు. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615 టన్నులు, పొటాష్ 2,918 టన్నులు, సూపర్ 6,324 టన్నులు ఉన్నాయన్నారు.
News July 7, 2025
రంప : 9000మంది విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 21 గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని ITDA. PO. సింహాచలం సోమవారం ప్రకటనలో తెలిపారు. దాదాపు 9 వేల మంది బాల, బాలికలకు వీటిని అందజేస్తామన్నారు. డిటర్జెంట్ సోప్స్, పౌడర్, బాత్ సోప్స్, షాంపు పాకెట్స్, కోకోనట్ ఆయిల్, వేజలైన్, టూత్ పేస్ట్, బ్రష్ తదితర వస్తువులు ఉంటాయని తెలిపారు.