News January 30, 2025

సత్యసాయి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల బంద్: AISF

image

అనంతపురం ఓ జూనియర్ కళాశాలలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కళాశాలపై చర్యలు తీసుకోలేదని AISF నాయకులు అన్నారు. దీనికి నిరసనగా ఈనెల 31న శ్రీ సత్య సాయి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బంద్‌కు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషం మహేంద్ర, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమస్యను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News September 16, 2025

ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

image

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ రాశారు. ఈ విధానం పేదలపై ఆర్థిక భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

News September 16, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటి విడుదల

image

వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 5-6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంగళవారం రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీంద్ర చారీ తెలిపారు. కడెం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీరు పెరిగిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువులు, గొర్రెల కాపరులు, చేపల వేటగాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 16, 2025

BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.