News January 30, 2025

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రిజర్వేషన్లపై కమిషన్, క్యాబినెట్ చర్చించినట్లు తెలిపారు. 3 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 2, 2026

మున్సిపల్ ఎన్నికలు.. సీఎం జిల్లాల పర్యటన

image

TG: కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. వచ్చే నెల 3న జడ్చర్లలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తర్వాత మిగతా జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.

News January 2, 2026

రోడ్డుపై పొగమంచు.. ఈ జాగ్రత్తలు పాటించండి!

image

చలి తీవ్రత పెరగడంతో రహదారులపై పొగమంచు <<18738127>>దట్టంగా<<>> పేరుకుపోతోంది. దీనివల్ల ముందున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి, ఫాగ్ లైట్లను, పార్కింగ్ లైట్స్ వాడాలని సూచిస్తున్నారు. ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలని, సింగిల్ వేలో ఓవర్‌టేక్ చేయవద్దని కోరుతున్నారు. మలుపుల వద్ద ఇండికేటర్లు వాడాలని చెబుతున్నారు. share it

News January 2, 2026

ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

image

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, ప‌న‌స‌, వాక్కాయ‌లు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల త‌గ్గ‌డంతో పాటు క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.