News January 30, 2025

MBNR: పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ(పీయూ) డిగ్రీ- I, III & V ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.ఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.palamuruuniversity.com వెబ్ సైట్‌లో పొందుపరచామన్నారు. సెమిస్టర్-Iలో 32.61%, సెమిస్టర్-IIIలో 37.75%, సెమిస్టర్-Vలో 48.81% మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప, పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజ్ కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

ఫ్రీగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా అప్లై

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1,750 త్రీవీలర్ <<18191488>>మోటార్ సైకిళ్లు<<>> అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
>అర్హతలు
*రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కనీసం 10th పాసై స్వయం ఉపాధి
*18-45 ఏళ్ల లోపు వయసు. 70% అంగవైకల్యం
*డ్రైవింగ్ లైసెన్స్
> దరఖాస్తులకు లాస్ట్ డేట్ నవంబర్ 25. సైట్ <>www.apdascac.ap.gov.in<<>>

News November 4, 2025

HYD: పిల్లలకు ఇక నుంచి టిఫిన్!

image

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌లోని 3,253 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంలో మెరుగుదలతో పాటు పాఠశాల హాజరును పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మెనూలో ఇడ్లీ, ఉప్మా, రాగి జావ, అటుకుల ఉప్మా వంటి వంటకాలు ఉండనున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం.

News November 4, 2025

కామారెడ్డిలో భారీ చోరీ

image

కామారెడ్డిలోని దేవునిపల్లి సిద్ధి వినాయక నగర్ కాలనీలో చంద్రమోహన్‌ రెడ్డికి చెందిన తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చే సరికి మంగళవారం ఇంట్లో అంతా చెల్లాచెదురుగా ఉన్నాయి. 6.5 తులాల బంగారం, 1.75 కిలోల వెండి, లక్షన్నర నగదు దొంగిలించినట్లు బాధితుతుడు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న SI భువనేశ్వర్ క్లూస్ టీం, సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.