News March 18, 2024
జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డారు: CBN
AP: జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని చంద్రబాబు అన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం సంఘాల నేతలు CBNను కలిశారు. అన్ని అస్త్రాలు పోయి.. జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డారని మాజీ సీఎం విమర్శించారు. జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తాపడ్డారని, బీజేపీతో పొత్తు అనంతరం మత రాజకీయానికి వైసీపీ తెరతీసిందని మండిపడ్డారు. ముస్లింలకు మేలు చేసేది టీడీపీనే అని చెప్పారు.
Similar News
News January 9, 2025
పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు
AP: తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.
News January 9, 2025
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?
వన్డే వరల్డ్ కప్‌లో తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమైన మహ్మద్ షమీ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనే ఆయన ఆడుతారని భావించినా ఫిట్‌నెస్ లేమితో జట్టులోకి రాలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో షమీ టీమ్‌లోకి వస్తే భారత బౌలింగ్ పటిష్ఠం కానుంది.
News January 9, 2025
తొక్కిసలాటకు కారణం అదే: టీటీడీ ఈవో
AP: డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని, 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.