News January 30, 2025

అవార్డులు సాధించిన పత్తికొండ విద్యార్థులు

image

వికసిత్ భారత్ 2047 అనే అంశంపై SSGS (గుంతకల్) కళాశాలలో జరిగిన జాతీయ సదస్సులో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని అవార్డులు సాధించారు. సాంకేతికతో నైపుణ్యాన్ని పెంపొందించుకొని పలు రంగాలలో విస్తృతంగా వినియోగించి స్థిరమైన అభివృద్ధి సాధ్యమని వ్యవసాయ సమస్యల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరిష్కరించాలని శివప్రసాద్, శ్రావణి, లత అన్నారు.

Similar News

News November 13, 2025

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌‌లో సమర్పించాలని సూచించారు.

News November 13, 2025

మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

News November 12, 2025

రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

image

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.