News March 18, 2024

జూనియర్ NTR కొత్త లుక్

image

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్‌నెస్ ట్రైనర్‌తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్‌లో తారక్ సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణ ఉండే అవకాశం ఉంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కొరటాల డైరక్టర్. ఈ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News August 28, 2025

భారీ వర్షాలు.. లేహ్‌లో చిక్కుకున్న మాధవన్

image

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా నటుడు మాధవన్ మరోసారి లేహ్‌లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 17 ఏళ్లనాటి ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘మేము షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. గత 4రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. 2008లో త్రీ ఇడియట్స్ షూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఇలాగే చిక్కుకున్నాం. అప్పుడు మంచు విపరీతంగా కురిసింది’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు.

News August 28, 2025

వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

image

AP: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్షించారు. ‘అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి.. లోతట్టు, కృష్ణా పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సహాయక చర్యలకు NDRF, SDRF సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ప్రమాదకర హోర్డింగులు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలి’ అని అధికారులను ఆదేశించారు.

News August 28, 2025

SALUTE: మీరే మా సూపర్ హీరోస్!

image

ఆపద వేళ పోలీసులు సూపర్ హీరోలుగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సాయం కోసం ఎదురుచూస్తోన్న వేలాది మందికి చేయందిస్తున్నారు. భారీ వరదను సైతం లెక్క చేయకుండా ఇళ్లలోకి వెళ్లి వృద్ధులు, పిల్లలను ఒడ్డుకు చేరుస్తున్నారు. వీరికి ఆర్మీ జవాన్లు సైతం తోడవడంతో ప్రాణనష్టం జరగకుండా రేయింబవళ్లు అలర్ట్‌గా ఉంటున్నారు. వీరికి సెల్యూట్ చేయాల్సిందే.