News March 18, 2024
విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల పరిధిలోని పెద్దపలువు తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్యా అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంవద్ద బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 10, 2026
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
News March 10, 2026
నల్గొండ: నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు సాగనున్నాయి. మొత్తం 6 పరీక్షలే ఉన్నప్పటికీ, ప్రతి పేపర్‌కు మధ్య 4 నుంచి 6 రోజుల విరామం ఉండటంతో ఏప్రిల్ మధ్య వరకు షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేందుకు SSC బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్షలు త్వరగా ముగిసేవి, కానీ ఈసారి ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 10, 2026
నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.


