News January 30, 2025

ప్రత్యేక హోదా అడగడానికి మీ ఇబ్బందేంటి?: షర్మిల

image

AP: కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటి? అని CM చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. ‘మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న PM మోదీ విభజన హామీలను నెరవేర్చాలి. ఈ నెల 31నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ పార్టీ MPలు తమ గళం విప్పాలి. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలి’ అని ఆమె బహిరంగ లేఖ రాశారు.

Similar News

News January 31, 2025

IND vs ENG: సిరీస్ చేజిక్కించుకుంటారా?

image

భారత్-ఇంగ్లండ్ మధ్య ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాళ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కు అన్ని విధాలా సిద్ధమైనట్లు కెప్టెన్ సూర్య తెలిపారు. ప్రస్తుతం మన జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా గత మ్యాచులో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

News January 31, 2025

కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు

image

AP: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడ 15మంది న్యాయమూర్తులకు తగిన సౌకర్యాల వివరాలను తమకు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల పరిశీలన పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. YCP హయాంలో కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో నిర్మించిన APERC భవనాన్ని వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

News January 31, 2025

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. కారణాలు ఇవేనా?

image

ఇటీవల వరుస <<15307610>>విమాన ప్రమాదాలు<<>> ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు 5 కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 50 శాతం విమాన ప్రమాదాలకు పైలట్లే కారణమని అంటున్నారు. 20 శాతం సాంకేతిక సమస్యలు, 15 శాతం తుఫాన్లు, పిడుగులు, ప్రతికూల వాతావరణం, 5 శాతం టెర్రరిజం, మిస్సైల్ దాడులు, 10 శాతం ప్రమాదాలకు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.