News March 18, 2024
శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం: డీకే అరుణ

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ BJPలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు DK అరుణ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. BJPకి ప్రజలలో ఉన్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.
Similar News
News August 17, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాలలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. నవాబుపేట 33.5, మిడ్జిల్ 28.0, భూత్పూర్ 16.3, కోయిలకొండ మండలం పారుపల్లి 13.0, నవాబుపేట 12.8, మహబూబ్‌నగర్ అర్బన్ 10.8, హన్వాడ 10.0, రాజాపూర్ 8.3, మహమ్మదాబాద్ 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News August 17, 2025
MBNR: 24 గంటల్లో నమోదైన వర్షపాతం

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా మిడ్జిల్ మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యల్పంగా బాలానగర్ మండలంలో 0.3 మి.మీ వర్షపాతం కురిసింది. కౌకుంట్ల చిన్న చింతకుంట రాజాపూర్ మహమ్మదాబాద్ మండలాలలో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. నేడు రేపు కూడా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News August 16, 2025
MBNR: పనులకు శ్రీకారం చుట్టిన ఎంపీ డీకే అరుణ

అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆమె MBNR జిల్లాలోని చిన్న చింతకుంటలో పర్యటించారు. రూ.18 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. వాల్మీకి దేవాలయం, మాతా గంగా భవాని ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.65 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.