News January 30, 2025
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు: అంబటి

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీమంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.
Similar News
News February 17, 2026
GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
News February 17, 2026
GNT: అసెంబ్లీలో విద్యార్థుల సందడి

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
News February 17, 2026
వేసవిలో నీటిసమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా నీరు, పారిశుద్ద్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారీగా నిధుల లభ్యత నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బోరు బావులు మరమ్మతులు 24 గంటల్లో పూర్తి చేయుటకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచాలన్నారు.


