News January 30, 2025

స్టేషన్ ఘన్పూర్‌లో న్యాయస్థానం ఏర్పాటు

image

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఫిబ్రవరి 1న న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్ట్ జడ్జి సూరేపల్లి నంద హాజరై ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రజలకు సత్వరమే న్యాయ సేవలు అందించేందుకు ఈ న్యాయస్థానం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.

Similar News

News November 8, 2025

సంకటహర గణపతి వ్రతం ఎలా చేయాలంటే..?

image

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. గణపతి పూజ చేసి, ఎర్ర గుడ్డలో పసుపు, కుంకుమ, బియ్యం, ఖర్జూరం, వక్కలు, దక్షిణ వేసి ముడుపు కట్టి, కోరిక మనసులో అనుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం, మౌనంగా ఉంటూ గణపతిని కొలవాలి. సాయంత్రం దీపాలు పెట్టాలి. ముడుపు బియ్యంతో బెల్లం పాయసం, ఉండ్రాళ్లతో నైవేద్యం పెట్టాలి. వ్రతానికి ముందు రోజు, తర్వాత రోజు కూడా మద్యమాంసాలు ముట్టొద్దు. మరుసటి రోజు హోమం చేస్తే శుభం.

News November 8, 2025

‘ఓట్ చోరీ’.. యువతి సెల్ఫీ దుమారం!

image

ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి బలం చేకూర్చేలా ఓ లాయర్ సెల్ఫీ వైరలవుతోంది. పుణేకు చెందిన ఉర్మీ అనే లాయర్ బిహార్‌లో ఎన్నికల రోజు.. ‘Modi-Fied ఇండియా కోసం ఓటేశాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఫాలోవర్స్ ఆమె అకౌంట్‌ను పరిశీలించగా.. గతంలో ‘పుణే ఎన్నికల్లో ఓటేశాను’ అని మరో ఫొటో ఉంది. ఇలాగే ఓటేస్తున్నారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.

News November 8, 2025

కామారెడ్డి: రాష్ట్ర పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పురస్కారాల ప్రధానం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు. KMR జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల శుక్రవారం తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతులను ఈనెల 12 వరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూం నంబర్ 31, కలెక్టరేట్‌లో సమర్పించాలని కోరారు.