News January 30, 2025
లిప్‌స్టిక్, ఫేస్‌క్రీమ్ కొంటున్నారా?
లిప్‌స్టిక్, ఫేస్‌క్రీమ్ వంటి కాస్మొటిక్స్‌లో అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్నట్లు, అవి వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని కేరళ ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తులపై మెర్క్యూరియస్ క్లోరైడ్, మెర్క్యూరీ, మెర్క్యూరిక్, మెర్క్యూరియో, కలోమెల్ రాసి ఉంటేనే కొనాలి. ఇలా ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో రాసిలేకపోతే కొనొద్దు. మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల వణుకు, డిప్రెషన్, వినికిడి లోపం సమస్యలొచ్చే ఆస్కారముంది.
Similar News
News January 31, 2025
కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు
AP: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడ 15మంది న్యాయమూర్తులకు తగిన సౌకర్యాల వివరాలను తమకు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల పరిశీలన పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. YCP హయాంలో కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో నిర్మించిన APERC భవనాన్ని వాడుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
News January 31, 2025
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. కారణాలు ఇవేనా?
ఇటీవల వరుస <<15307610>>విమాన ప్రమాదాలు<<>> ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు 5 కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 50 శాతం విమాన ప్రమాదాలకు పైలట్లే కారణమని అంటున్నారు. 20 శాతం సాంకేతిక సమస్యలు, 15 శాతం తుఫాన్లు, పిడుగులు, ప్రతికూల వాతావరణం, 5 శాతం టెర్రరిజం, మిస్సైల్ దాడులు, 10 శాతం ప్రమాదాలకు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
News January 31, 2025
మేలో ‘స్పిరిట్’ ప్రారంభం?
సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్‌ను మేలో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ప్రభాస్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం మృణాల్, ఆలియా, రష్మిక పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని మూవీ వర్గాలు తెలిపాయి.