News January 30, 2025
ఈపూరు: తండ్రిని కాలువలోకి నెట్టి వేసిన కుమారుడు

ఈపూరు మండలంలోని బద్రుపాలెం వద్ద సాగర్ కుడి కాల్వలో కన్న తండ్రిని కుమారుడు నెట్టి వేసినట్లు స్థానికులు సమాచారం. అది గమనించి కాలువలో పడిన వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే కాలువలో పడ్డ వృద్ధుడిని బయటకు తీసే సరికి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.
Similar News
News January 23, 2026
జగిత్యాల జిల్లాలో మూడు రోజుల పాటు నీటి సరఫరా బంద్

మెట్పల్లి మండలం వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఏర్పడిన మిషన్ భగీరథ పీసీసీపీ ప్రధాన పైపు లైన్ లీకేజీ మరమ్మతు కారణంగా మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహక ఇంజనీర్ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గం పరిధిలో ఉన్న గ్రామాలకు, మున్సిపాలిటీలకు నీరు ఇవ్వడం జరగదన్నారు. కావున ఆయా నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని సహకరించాలని కోరారు.
News January 23, 2026
రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకుందాం: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా రంజాన్ మాసాన్ని మతసామరస్యంతో, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల వద్ద విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 23, 2026
వరి సేకరణ: కామారెడ్డికి కమెండేషన్ సర్టిఫికేట్

వరి సేకరణలో కామారెడ్డి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. రైతులకు మూడు రోజుల్లోనే కనీస మద్దతు ధర చెల్లింపులు పూర్తి చేసినందుకు గాను జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ స్టీఫెన్ రవీందర్ చేతుల మీదుగా జిల్లా అధికారులైన వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.


