News January 30, 2025

సోమవారం ఆ స్కూళ్లకు సెలవు

image

TG: ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 3న (సోమవారం) వస్తోంది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు సెలవు ఉండనుంది. హాలిడేపై మిగతా స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అటు ఏపీ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే కూడా ఇవ్వలేదు. దీంతో ఆ రాష్ట్రంలో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి.

Similar News

News April 2, 2026

హనుమాన్ జయంతి.. ఇలా చేస్తే మనశ్శాంతి!

image

నేడు చైత్ర పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవాళ ఆంజనేయుడి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. బలం, భక్తికి నిదర్శనమైన పవన సుతుడిని కొలవడం వల్ల కష్టాలు తొలగి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంజన్న భక్తులు నేటి నుంచి మే 12 వరకు 41 రోజుల పాటు దీక్షను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

News April 2, 2026

పింపుల్స్ ఎందుకొస్తాయి?

image

మొటిమలకు ప్రధాన కారణం శరీరంలో ఇన్సూలిన్ పెరగడమని వైద్యులు చెబుతున్నారు. ‘కూల్‌డ్రింక్స్, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, న్యూడిల్స్ వంటివి ఇన్సూలిన్ స్థాయిని పెంచి, ఆండ్రోజెన్ ఉత్పత్తికి దారి తీస్తాయి. ఈ ఆండ్రోజెన్ చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేయడంతో బాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి. వాల్‌నట్స్, అవిసె, గుమ్మడి గింజలు, చేపలు, పాలకూర, క్యారెట్లు, టమాటా చర్మాన్ని రక్షిస్తాయి’ అని తెలిపారు.

News April 2, 2026

నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.