News January 30, 2025
ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆలపాటి

కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థి(టీడీపీ కూటమి) ఆలపాటి రాజేంద్ర గురువారం ఎన్టీఆర్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన విజయవాడ పరిసరాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. రానున్న MLC ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఆలపాటి ఆయా విద్యాసంస్థల సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 18, 2025
జగిత్యాల: ‘జీపీఎఫ్ ప్రతిపాదనలు నేరుగా జడ్పీలోనే స్వీకరించాలి’

ఉపాధ్యాయుల జీపీఎఫ్ ప్రతిపాదనలను గతంలో మాదిరిగానే నేరుగా జడ్పీ కార్యాలయంలోనే స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్ గురువారం జడ్పీ డిప్యూటీ సీఈఓ నరేష్‌కు వినతిపత్రం అందజేశారు.
News September 18, 2025
ఇచ్చోడ: పోలీసులపై దాడి.. ప్రధాన నిందితుడి అరెస్ట్

కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
News September 18, 2025
మంచిర్యాలలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మంచిర్యాల పట్టణంలోని సూర్య నగర్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు ఏసీపీ ప్రకాశ్ ఆదేశాలతో సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతి గురువారం సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఓ ఇంట్లో బాదే రాజమణి, సమీల రాకేశ్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, వారితోపాటు విటులు కొండ విజయ్, కావేటి సురేశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.