News January 30, 2025

కాల్వ శ్రీరాంపూర్: విషపురుగు కుట్టి వ్యక్తి మృతి

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి మధునయ్య విషపురుగు కుట్టి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలలో పార్ట్ టైం స్వీపర్ గా పనిచేస్తున్న మధునయ్యను జనవరి 26న ఏదో విషపురుగు కుట్టింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కొడుకు బండి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.

Similar News

News November 6, 2025

వరంగల్‌లో పలు రైళ్ల హాల్టింగ్‌లు..!

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మధ్య నాలుగు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ నెల 9, 16న చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 10, 17న దానాపూర్ నుంచి చర్లపల్లి (07050) రైళ్లు కాజీపేట మీదుగా నడుస్తాయి. ఈ రైళ్లకు కాజీపేటతో పాటు పలు స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.

News November 6, 2025

HYD: TGCABలో JOBS.. నేడు లాస్ట్

image

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు నేటితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT