News January 30, 2025

అంబర్‌పేటలో కానిస్టేబుల్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మాదన్నపేట PSలో PCగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు (42) అంబర్‌పేటలోని దుర్గానగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. తన ఇంట్లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 24, 2026

కర్నూలు: ఇంటర్‌ పరీక్షలకు 297 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 297 మంది విద్యార్థులు హాజరు కాలేదని రీజనల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ లాలప్ప తెలిపారు. మొత్తం 21,147 మంది విద్యార్థులకు గానూ 21,174 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన స్పష్టం చేశారు.

News February 24, 2026

నంద్యాల: ఇంటర్‌ పరీక్షలకు 296 మంది గైర్హాజరు

image

నంద్యాల జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 296 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా డీఐఈఓ శంకర్ నాయక్ వెల్లడించారు. మొత్తం 14,424 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల కొందరు రాలేకపోయారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని వివరించారు.

News February 24, 2026

తిరుపతి జిల్లాలో పరీక్షలకు 450 మంది డుమ్మా

image

తిరుపతి జిల్లాలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షలు మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 29,602 మంది విద్యార్థులకు గాను 29,152 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 450 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.