News January 31, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔MBNR:పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
✔420 హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్:BRS
✔NRPT:ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు:పోలీసులు
✔ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
✔7 నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
✔బిజినపల్లి: కుష్ఠి వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ
✔సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా:ఎమ్మెల్యేలు
✔గద్వాల: విద్యార్థిని చితకబాదిన టీచర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Similar News
News March 2, 2026
MBNR: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్- 100 లేదా 8712659360 ను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
News March 2, 2026
మన్యంకొండ: శ్రీ అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ

మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజపతాకాన్ని ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
News March 1, 2026
మహబూబ్ నగర్: జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు

శాంతిభద్రతల పరిరక్షణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


