News January 31, 2025

MAHAKUMBH MELA: ఒకే రోజు 364 రైళ్లు

image

మహాకుంభమేళాకు భారీగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 10,028 రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా మరో 3,400 రైళ్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మౌని అమావాస్య సందర్భంగా ఒక్క రోజే ప్రయాగ్‌రాజ్ నుంచి 364 రైళ్లను నడిపినట్లు ఆయన వివరించారు. నిన్న పవిత్ర స్నానం కోసం భక్తులు పోటెత్తగా అర్ధరాత్రి తర్వాత తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News November 8, 2025

వాట్సాప్‌లో క్రాస్ ప్లాట్‌ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

image

వాట్సాప్ క్రాస్ ప్లాట్‌ఫామ్ అనే కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్‌కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.

News November 8, 2025

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ఎంతంటే..

image

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపాన్ ఉత్పత్తి చేస్తోంది. ‘కిన్మెమై ప్రీమియం’ రకం బియ్యం ధర KG ₹12,500 పలుకుతోంది. 2016లో 840 గ్రా.కు ₹5,490 ధరతో ఖరీదైన బియ్యంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రపంచంలోనే విలువైన, ఉత్తమమైన ధాన్యాలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ వల్ల వీటికి ఇంత విలువ. వడ్లను వివిధ దశల్లో బియ్యంగా మారుస్తారు. కడగాల్సిన అవసరం లేకుండానే వండుకోగలగడం మరో స్పెషాలిటీ.

News November 8, 2025

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. మరో వికెట్ తీస్తే మూడు ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలవనున్నారు. అలాగే టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్ కానున్నారు. 50 టెస్టుల్లో 226, 89 వన్డేల్లో 149, 79 టీ20ల్లో 99 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆసీస్, ఇండియా మధ్య చివరిదైన ఐదో టీ20 రేపు జరగనుంది.