News January 31, 2025

బాపట్ల: ‘వైసీపీ నిర్లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది’

image

గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమైందని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు చెప్పారు. గురువారం బాపట్లలోఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేసి రూ.10 లక్షల కోట్లు భారం రాష్ట్రంపై పెట్టిందన్నారు. ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.

Similar News

News January 12, 2026

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం: మంత్రి వివేక్

image

రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ క్యాంప్ ఆఫీస్‌లో రైతులకు సబ్సిడీ కింద రూ.80లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

News January 12, 2026

గద్వాల: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డిప్యూటీ సీఎం

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు, యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా విడుదలైనందున మిగిలిన ఎన్నికల ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.

News January 12, 2026

పాఠశాలల నిర్మాణం వేగవంతం చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం మోతేలో చేపట్టిన పాఠశాల భవనాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.