News March 18, 2024
ప్రకాశం: 74 మంది ఇంటర్ అధ్యాపకులకు నోటీసులు

జిల్లాలో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి గైర్హాజరైన 74 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలులోని ఓ జూనియర్ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు 405 మంది అధ్యాపకులను నియమించారు. వీరిలో 331 మంది హాజరు కాగా, 74 మంది గైర్హాజరయ్యారు. వీరికి ఆర్‌ఐవో సైమన్ విక్టర్ నోటీసులు జారీ చేశారు.
Similar News
News January 12, 2026
ప్రకాశం జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటు చేశారు.

News January 11, 2026
ప్రకాశం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటుచేశారు.