News January 31, 2025
హైదరాబాద్ చరిత్రలో నేడు కీలకం!

హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్‌లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.
Similar News
News July 6, 2025
సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు: కలెక్టర్

సిగాచీ పరిశ్రమలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. 34 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 9 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించినట్లు వివరించారు.
News July 6, 2025
ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.
News July 6, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుత సంచారం

మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ అటవీ ప్రాంతంలోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత సంచారంపై 4 రోజులుగా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని రైతులు అన్నారు. శనివారం గుట్టలోని గుండుపై చిరుత కనిపించగా పొలాల వద్ద పశువులు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. అప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.