News January 31, 2025
NRPT: మెడికల్ కలశాలను సందర్శించిన కలెక్టర్

నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద ఉన్న మెడికల్ కలశాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కాలేజీలోని వివిధ విభాగాలను, కళాశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తేవాలని సూచించారు. కాలేజీకి మంచి పేరు వచ్చేలా ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్ కిషన్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
మంచిర్యాల: ఆరు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 23, 24, 26, 27, 28, 29 తేదీల్లో ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఫస్ట్ ఏసీ నుంచి జనరల్ క్లాస్ వరకు అన్ని సౌకర్యాలతో రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
News October 22, 2025
కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.
News October 22, 2025
వరంగల్‌లో జాబ్ మేళా

WGL ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.కల్పన తెలిపారు. ప్రైవేటు సంస్థలో 76 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా పై చదువులు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎంపికైన వారికి రూ.15,000 వేతనం, టీఏ–డీఏ రూ.3,000 చెల్లిస్తారన్నారు. ఉదయం 11 గంటలకు బయోడేటా, సర్టిఫికేట్ జిరాక్స్‌లతో రావాలన్నారు.