News January 31, 2025
ఏలూరు: ఎన్నికల నియమావళి పాటించాలి- కలెక్టర్

తూ.గో, పా.గో, ఏలూరు జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వేరే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాధనలను ఈ నెల 31న సమర్పించాలన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
Similar News
News January 13, 2026
జపాన్‌కు ఎంపికైన మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థి

రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన పరశురాం ‘సకుర సైన్స్ టాలెంట్’ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి జపాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్న ఇతడు, వారం రోజుల పాటు జపాన్‌లోని అధునాతన సాంకేతికతను పరిశీలించి, శాస్త్రవేత్తలతో భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపక బృందం పరశురాంను ఘనంగా సన్మానించారు.
News January 13, 2026
పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.
News January 13, 2026
భారత్‌కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్‌కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్‌కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.


