News January 31, 2025
పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించాలని సీఎంకు వినతి

సూర్యాపేట జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 22, 2026
పాలమూరు: జిల్లాకు ప్రాణధారలు కృష్ణ, దుందుభి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణ, దుందుభి నదులు వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నాయి. జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. నేడు ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, ఈ జీవనదులను కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
News March 22, 2026
NGKL: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’

నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకానున్నాయి. తొలిదశలో ఎకరా లోపు భూమి ఉన్నవారికి పెట్టుబడి సాయం అందనుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 3.41 లక్షల మంది రైతులకు గాను మొత్తం రూ.415.23 కోట్లు జమ చేయనున్నారు. జిల్లాలో సుమారు 8.30 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తించనుంది.
News March 22, 2026
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌కు మూడు పరీక్షలు?

TG: రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు లైసెన్స్ జారీలో త్రీ టైర్ సిస్టమ్ తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం LLR, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు మరో టెస్ట్‌ను యాడ్ చేయనుంది. LLR పరీక్ష కన్నా ముందు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు గంటల నిడివిగల ఈ పరీక్షలో ఆరు పార్టులు ఉంటాయి.


