News January 31, 2025
NGKL జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో మంత్రి జూపల్లి సమీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిపై హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.
Similar News
News November 2, 2025
జనగామలో రేపటి ప్రజావాణి రద్దు

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో నష్ట ప్రభావంపై ప్రాథమిక అంచనా సర్వేలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News November 2, 2025
విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.
News November 2, 2025
వనపర్తి: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేయండి

2025లో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. అదే విధంగా గతంలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు ఎంపికైన వారు రెన్యువల్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు https://scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


