News January 31, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల సేకరణకై పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారదా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News September 15, 2025

ADB: సైబర్ వల.. చిక్కితే విలవిల!

image

సైబర్ మోసగాళ్లు రోజుకో మార్గం ఎంచుకొని అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆఫర్లు, బెట్టింగ్స్, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే డబ్బులిస్తామని, హనీట్రాప్ ఇలా విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. వీరి వలలో చిక్కుకున్న బాధితులు విలవిల్లాడుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. గత వారంలో ADB జిల్లాలో 20+ కేసులు నమోదయ్యాయి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండి.
SHARE IT

News September 15, 2025

రాజమండ్రి: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2025

అల్లూరి: తుపాకీనే కాదు.. ‘కాటా’ కూడా కంపల్సరీ!

image

సాధారణంగా పోలీసుల విధుల్లో భాగంగా తుపాకీ తీసుకెళ్తుంటారు. కానీ అల్లూరి జిల్లాలో పోలీసులకు మాత్రం తుపాకీతో అదనపు బరువు ఒకటి తోడైంది. అదే వేయింగ్ మెషీన్. ఎందుకంటారా? ఏజెన్సీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని అక్కడికక్కడే తూకం వేయాల్సి వస్తోంది. దీంతో వేయింగ్ మెషీన్ తీసుకెళ్లడం వారికి తప్పనిసరి అయింది.