News January 31, 2025
కూటమి ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్: కొరముట్ల

రాయచోటిలో వైసీపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను, 8 నెలల చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా వైసీపీ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు.
Similar News
News December 27, 2025
కామారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణహత్య..!

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం మోటాట్‌పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఎర్రరాజు(32) హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 27, 2025
ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయిలా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగారంలో 10.5℃, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.8℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌లో 11.0℃, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ- 3 ములకాలపల్లిలో 11.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 27, 2025
SRPT: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించి ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లా కార్యాలయంలో వేడుకల నియమావళిని విడుదల చేశారు. డిసెంబరు 31 రాత్రి జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.


