News January 31, 2025
అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాను మార్యాదపూర్వకంగా కలిసిన సీపీ

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్న ఆర్గనైజషన్, హోంగార్డ్స్ అడిషనల్ స్వాతి లక్రాను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చాల అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. అడిషనల్ డీసీపీని కలసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏఎస్పీ భట్ ఉన్నారు
Similar News
News December 30, 2025
టూరిజనికి కేరాఫ్ అడ్రస్‌గా పోలవరం

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా టూరిజంకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారనుంది. మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్లు, ఘాట్ రోడ్, గుడిసె హిల్ స్టేషన్, అమృతధార, జలతరంగిని జలపాతాలు,రంప జలపాతం, పాపికొండల బోట్ యాత్ర ప్రత్యేక ఆకర్షణగా, జిల్లాకు ఆదాయ వనరులుగా ఉండనున్నాయి. అలానే జిల్లాలో అనేక పురాతనమైన ఆలయాలు, మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
News December 30, 2025
మామునూర్ ఎయిర్‌పోర్టుకు మార్చిలో శంకుస్థాపన!

వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టుకు మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ప్రధాని రానున్నారు. మహబూబాబాద్‌లోని రైల్వే పీవోహెచ్, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీతో పాటు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోపక్క శంకుస్థాపన చేసిన 9 నెలల్లోనే విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
News December 30, 2025
జిల్లాలో 2.35 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

కోనసీమ జిల్లాలో బుధవారం 26 రకాల పెన్షన్లను 2,35,153 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. వీరికి రూ.101.69 కోట్లను పంపిణీ చేస్తామన్నారు. 9,883 క్లస్టర్లకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసామన్నారు. ఈనెల 31న 90% పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని, అర్బన్ లో బ్యాంకుల నుంచి నిధులు విత్ డ్రా చేశారన్నారు.


