News January 31, 2025
జగన్‌తోనే నా ప్రయాణం: ఆదిమూలపు సురేశ్

AP: తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. తన రాజకీయ ప్రయాణం జగన్‌తోనేనని ఆయన స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాగే తనపై దుష్ప్రచారం జరిగిందని మండిపడ్డారు. బతికున్నంతవరకు వైసీపీతోనే ఉంటానని తేల్చిచెప్పారు. కాగా కొద్దిరోజులుగా సురేశ్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని వదంతులు చెలరేగిన విషయం తెలిసిందే.
Similar News
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.
News November 11, 2025
వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

TG: నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.


