News March 18, 2024

HYD: ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి

image

ట్రైన్ నుంచి జారిపడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ GRP పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. ఆదివారం నీలం సుమంత్ తన తమ్ముడితో కలిసి సొంతూరు ఖమ్మం జిల్లా కల్లూరు వెళ్లడానికి SCBD రైల్వే స్టేషన్‌కు వచ్చి ట్రైన్ ఎక్కాడు. అయితే ట్రైన్ ఎక్కే సమయంలో జారీ కింద పడ్డాడు. సుమంత్‌ను తమ్ముడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ.. మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News September 9, 2025

ఘట్‌కేసర్‌‌లో దారుణం.. ప్రశ్నించినందుకు చంపాడు

image

ఘట్‌కేసర్‌‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు.. బోయిగూడకు చెందిన భాస్కర్‌(27) పనికోసం వచ్చి స్థానిక అంబేడ్కర్ నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అక్కడే ఉండే మణిదీప్ ఆదివారం రాత్రి భాస్కర్‌తో గొడవ పడ్డాడు. అనవసరంగా ఎందుకు గొడవ పడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో మణిదీప్ ఇంట్లోంచి కత్తి తెచ్చి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ భాస్కర్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు.

News September 9, 2025

ఓయూలో నిపుణులను తయారు చేయడమే లక్ష్యం: వీసీ

image

విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేసే నిపుణులుగా తీర్చిదిద్దడమే AI, ML& డేటా అనలిటిక్స్‌లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం లక్ష్యమని ఓయూ వీసీ ప్రొ. కుమార్‌ మోలుగరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంజినీరింగ్ కళాశాలకు అభినందించారు. సర్టిఫికేషన్‌ కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించి మరింత ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందిస్తామన్నారు. ఇందులో ఏఐ లింక్‌ బృందం కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.

News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.