News January 31, 2025
‘తండేల్’లో ఆ ఒక్క సీన్ కోసం రూ.18 కోట్లు..!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ గురించి డైరెక్టర్ చందు మొండేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాలో చైతూ బాడీ లాంగ్వేజ్ కోసం డి.మత్య్సలేశం గ్రామానికి వెళ్లాం. అక్కడ ఆ గ్రామస్థుల అనుభవాల ప్రకారం సముద్రంలో తుఫాన్ సీక్వెన్స్ తీశాం. దీనికోసమే ఏకంగా రూ.18 కోట్లు ఖర్చు చేశాం. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
Similar News
News November 11, 2025
బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.
News November 11, 2025
విషం కలిపేందుకు లొకేషన్లలో మొయినొద్దీన్ రెక్కీ

HYD: గుజరాత్ ATS ఆదివారం అరెస్టు చేసిన Dr. SD మొయినొద్దీన్ విచారణలో భయానక కుట్ర బయటపెట్టాడు. చైనాలో MBBS చేసిన మొయిన్ ఇక్కడ ఆముదం తదితర వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషం తయారు చేస్తున్నాడు. ఈ విషాన్ని దేవాలయాలు, వాటర్ ట్యాంక్స్, ఫుడ్ సెంటర్లలో కలిపి మాస్ మర్డర్స్కు కొందరితో కలిసి ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ఇందుకు అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో రద్దీ ఫుడ్ కోర్టులు పరిశీలించాడని పేర్కొన్నారు.
News November 11, 2025
మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.


