News January 31, 2025

మనూర్: ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

image

మనూర్ మండలం బాదల్ గావ్ శివారులో ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మత్లి తండాకు చెందిన చౌహాన్(40) కుటుంబంతో కలిసి చెరుకు నరికే పనులకు వచ్చాడు. చెరకు తరలిస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు ఎడ్ల బండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

ప్రొద్దుటూరు: నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,400
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,248
* వెండి 10 గ్రాములు ధర రూ.2,530

News December 27, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో వీర్ బాల దివస్ పోస్టర్ల ఆవిష్కరణ

image

దేశ భవిష్యత్తుకు పిల్లలే పునాది అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం ఆయన వీర్ బాల దివస్ పోస్టర్లను ఆవిష్కరించారు. యువతలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, దేశాభివృద్ధిలో చురుగ్గా పాల్గొనేలా చేయడమే వికసిత భారత్ లక్ష్యమన్నారు. జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీల్లో భారత బాలశక్తి @ 2047 వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

News December 27, 2025

అన్నమయ్య జిల్లాలో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ

image

NTR భరోసా సామాజిక పెన్షన్ల పథకం కింద డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీన ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పెన్షన్ దారులందరూ ఆ రోజున తమ ఇళ్ల వద్దనే అందుబాటులో ఉండాలని సూచించారు. పెన్షన్ కోసం సచివాలయాలకు లేదా ఇతర కార్యాలయాలకు వెళ్లవద్దని, ప్రతి లబ్ధిదారునికీ ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తామని స్పష్టం చేశారు.