News January 31, 2025

MNCL: కరెంట్ సమస్యలా. 1912కి కాల్ చేయండి

image

ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తిన టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల  ఫెయిల్యూర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, తీగలు, విద్యుత్ మీటర్లు, బిల్లుల్లో సమస్యలపై 1912 నంబర్‌ను సంప్రదించి సేవలు పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 1, 2026

నారయణపేటలో రేపే మెగా జాబ్ మేళా

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెంనర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు నిరుద్యోగ యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఉదయాన్నే కళాశాలకు హాజరు కావాలన్నారు.

News March 1, 2026

VZM: ప్రశాంతంగా జిల్లా గురుకుల ప్రవేశ పరీక్ష

image

విజయనగరం జిల్లాలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త ఎం.మాణిక్యం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 1309 మందికి 1116 మంది హాజరు కాగా 193 మంది గైర్హాజరు అయ్యారన్నారు. ఇంటర్ జనరల్ పరీక్షకు 1433 మందికి 1292 మంది హాజరు కాగా.. 141మంది గైర్హాజరు అయ్యారని, ఐఐటీ-నీట్ పరీక్షకు 856 మంది హాజరయ్యారన్నారు.

News March 1, 2026

ఆన్లైన్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా: నెల్లూరు డీఈవో

image

జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను http://deonellore.50webs.com/ ఆన్లైన్లో పొందుపరిచామని డీఈవో డా. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో రేపటి నుంచి 7వ తేదీ లోగా పని దినాలలో సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్‌లో అందజేయాలన్నారు.