News January 31, 2025
సిద్దిపేట: రోడ్డు భద్రత అందరి బాధ్యత: శంకర్ నారాయణ

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సిద్దిపేట రవాణాశాఖ అధికారి శంకర్ నారాయణ అన్నారు. పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు ఎక్కువ శాతంలో అరికట్టవచ్చని వివరించారు. ఇందులో ఆధికారులు పాల్గొన్నారు.
Similar News
News July 10, 2025
PHOTOS: ‘బాహుబలి’ టీమ్ రీయూనియన్

ఇండియన్ మూవీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన ‘బాహుబలి’ మూవీ విడుదలై ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా రీయూనియన్ అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ తదితరులు ఒక్కచోట చేరి తమ జర్నీని గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
News July 10, 2025
సిరిసిల్ల: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రభుత్వ విప్

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా చంద్రంపేటలోని రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
News July 10, 2025
మెళియాపుట్టి: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.