News January 31, 2025
కామారెడ్డి: వచ్చే నెల 1 న జాబ్ మేళా

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వచ్చే నెల 1న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధు సూధన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, SSC ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
Similar News
News February 25, 2025
ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్‌లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.
News February 25, 2025
కామారెడ్డి: 100% ఉత్తీర్ణత సాధించాలనేదే లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ రివ్యూ సమావేశంలో మాట్లాడారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఫలితాలు మెరుగుపరచాలన్నారు. విద్యార్థులను విభాగాలుగా విభజించి, దత్తత తీసుకుని ఫలితాలు పెంచేలా కృషి చేయాలని సూచించారు.
News February 25, 2025
మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.