News January 31, 2025
చంద్రుడి వెనక ఉన్న పర్వతాలపై కొత్త విశ్లేషణలు

చంద్రునిపై స్థిర నివాసానికి జరుగుతున్న అధ్యయనాల్లో తాజా విశ్లేషణలు కొత్తదారులు చూపుతున్నాయి. చంద్రుని వెనుకవైపు ఉన్న చిన్న పర్వత ప్రాంతాలు (Mare Ridges), ముందువైపు ఉన్నవాటికంటే పిన్నవయస్సు కలిగినవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. Moonquakes వల్ల ఏర్పడే ఈ రిడ్జ్‌లు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ వనరులు, ముఖ్యంగా నీటి వనరులు ఉండే అవకాశం ఉందని, ఇవి మానవ నివాసాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
Similar News
News July 4, 2025
PHOTO: గోల్కొండ కోట అందం చూశారా?

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చాలా ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కోటను ఎప్పుడైనా మీరు ఆకాశంలో నుంచి చూశారా? దీని ఏరియల్ వ్యూకు సంబంధించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ కోట నిర్మాణం అబ్బురపరుస్తోంది. బోనాల సందర్భంగా ఈ ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.
News July 4, 2025
పనిమనిషి కుటుంబ ఆదాయం రూ.లక్ష!.. reddit పోస్ట్ వైరల్

తన ఇంట్లో పనిచేసే ఓ మహిళ కుటుంబం తనకంటే ఎక్కువ సంపాదిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయిన ఓ వ్యక్తి redditలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘మా పనిమనిషి ఇళ్లలో పనిచేయడం ద్వారా నెలకు రూ.30వేలు, కూలీగా ఆమె భర్త రూ.35వేలు, పెద్ద కొడుకు రూ.30వేలు, టైలరింగ్ చేస్తూ కుమార్తె రూ.3వేలు, చిన్న కొడుకు రూ.15వేలు సంపాదిస్తున్నాడు. ఇలా ఎలాంటి పన్ను చెల్లించకుండా నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.
News July 4, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎప్పుడంటే?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇతర నటీనటులతో సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రభాస్ నవంబర్ నుంచి షూట్‌లో పాల్గొంటారని మూవీ టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెబల్ స్టార్ కనిపించనున్నట్లు సమాచారం. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.