News January 31, 2025
టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: లోకేశ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ సంబంధిత జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో గురువారం సమావేశం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల విజయానికి ఇంఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేశ్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News February 25, 2025
మిర్చి రైతులకు మద్దతు ధర: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
News February 25, 2025
పెదకాకాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాదెండ్ల

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News February 25, 2025
కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్ధవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మీ ఆదేశించారు. కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులకు సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్ధి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రావాల్సి ఉందన్నారు. ఓట్లు లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.