News March 18, 2024
ALERT: మీ పళ్లు పుచ్చిపోయాయా?
పళ్లు పుచ్చిపోయిన వ్యక్తికి గుండెలో నొప్పి రావడంపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఓ వైద్యుడు రిప్లై ఇచ్చారు. ‘గట్టిగా ఏదైనా కొరికినప్పుడు పుచ్చిపళ్లలో ఉన్న బ్యాక్టీరియా సరాసరి రక్తంలోకి వెళ్లి అక్కడి నుంచి గుండెలోకి వెళ్తుంది. గుండె కవాటాల (వాల్వ్స్)లో పుండ్లు పుట్టిస్తుంది. దీంతో జ్వరం, ఛాతినొప్పి వస్తుంది. వెంటనే వైద్యం చేయకపోతే గుండె పాడై చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే అందరిలో ఇలా జరగదు’ అని తెలిపారు.
Similar News
News January 9, 2025
స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో
స్పేస్ డాకింగ్ ప్రయోగం(స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్లు ISRO తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి డాకింగ్ తేదీని మాత్రం ISRO వెల్లడించలేదు. 2 ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి, నేడు మరోసారి వాయిదా పడింది.
News January 9, 2025
నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం
TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్‌లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.
News January 9, 2025
తిరుపతి బాధితులకు నేడు పరిహారం ప్రకటన
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19వరకు ఉంటుందని వెల్లడించారు.