News January 31, 2025
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. కారణాలు ఇవేనా?

ఇటీవల వరుస <<15307610>>విమాన ప్రమాదాలు<<>> ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు 5 కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 50 శాతం విమాన ప్రమాదాలకు పైలట్లే కారణమని అంటున్నారు. 20 శాతం సాంకేతిక సమస్యలు, 15 శాతం తుఫాన్లు, పిడుగులు, ప్రతికూల వాతావరణం, 5 శాతం టెర్రరిజం, మిస్సైల్ దాడులు, 10 శాతం ప్రమాదాలకు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
Similar News
News February 25, 2025
IPL ఆడుతూనే టెస్టులకూ సన్నద్ధం!

ఈ ఏడాది జూన్-జులైలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ జరిగే రెండు నెలలపాటు (మార్చి 22-మే 25) భారత ప్లేయర్లతో రెడ్ బాల్ ప్రాక్టీస్ కూడా చేయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు CRICBUZZ పేర్కొంది. ఇటీవల టెస్టుల్లో వరుస ఓటములు ఎదురు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ ను ఎలా అమలు చేస్తారనేది తెలియాల్సి ఉంది.
News February 25, 2025
20 ప్రశ్నలు.. కిడ్నాప్‌తో సంబంధం లేదన్న వంశీ?

AP: వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు రెండున్నర గంటలు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు సంబంధించి 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించిన కోర్టు 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.
News February 25, 2025
డేంజర్ బెల్స్: పెరుగుతున్న సెకండరీ ఇన్ఫెర్టిలిటీ

దంపతులు రెండో బిడ్డను కనడం కష్టమవుతోందని వైద్యులు అంటున్నారు. ఏళ్లు గడిచే కొద్దీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ రేటు పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతమిది 30%కి చేరిందని, అనారోగ్యం, జీవనశైలి సమస్యలే ఇందుకు ప్రధాన కారణాలని చెప్తున్నారు. దీంతో పురుషుల్లో వీర్యం నాణ్యత, మహిళల అండాశయాల్లో గుడ్లు తగ్గుతున్నాయని వివరించారు. BP, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, PCOD వంటివి సమస్యను పెంచుతున్నాయని చెప్పారు.