News January 31, 2025

IND vs ENG: సిరీస్ చేజిక్కించుకుంటారా?

image

భారత్-ఇంగ్లండ్ మధ్య ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాళ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కు అన్ని విధాలా సిద్ధమైనట్లు కెప్టెన్ సూర్య తెలిపారు. ప్రస్తుతం మన జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా గత మ్యాచులో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

Similar News

News January 15, 2026

మనోళ్లదే డామినేషన్.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు!

image

అండర్-19 WCలో INDతో ఆడుతున్న అమెరికా జట్టులోని ప్లేయర్లందరూ భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్ పూర్వీకులు ఇండియా నుంచి వెళ్లారు. దీంతో మనోళ్ల డామినేషన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది IND vs USA కాదని.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు అని జోకులు పేలుస్తున్నారు.

News January 15, 2026

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.

News January 15, 2026

సొంతూరు వెళ్లొస్తే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుంది: CBN

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే సంప్రదాయం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సొంతింటికి వెళ్లొస్తే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుందని నారావారిపల్లిలో మీడియాతో చెప్పారు. ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన కలుగుతుందని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, జీవనప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.