News March 18, 2024

BRS ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్: కేసీఆర్

image

TG: RS.ప్రవీణ్ కుమార్‌ను BRS ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. BRS పార్టీని పునర్నిర్మిస్తానని, కమిటీలు వేస్తామని శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Similar News

News March 7, 2026

మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు: భారత్

image

రష్యా నుంచి ఆయిల్ కొనడానికి భారత్‌కు 30 రోజులు <<19308509>>అనుమతిస్తున్నట్లు<<>> అమెరికా చేసిన ప్రకటనపై కేంద్రం స్పందించింది. ‘హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు నెలకొన్నందున చౌకగా లభించే ఏ దేశం నుంచైనా ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటాం. దీనికి ఎవరి అనుమతీ అవసరం లేదు. మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. మేం ముడి చమురు వనరుల లభ్యతను 27 నుంచి 40 దేశాలకు విస్తరించాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

News March 7, 2026

650 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

image

RBIలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికే రేపే చివరి తేదీ. 50% మార్కులతో డిగ్రీ పాసై, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారు అర్హులు. వయోపరిమితి 20-28 ఏళ్లు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://rbi.org.in./

News March 7, 2026

అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

image

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.