News January 31, 2025

బంగాళాఖాతంలో ద్రోణి.. రేపు వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించినట్లు IMD వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు, కోస్తా మీదుగా తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో పగటిపూట వాతావరణం చల్లగా మారినట్లు పేర్కొంది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

Similar News

News January 12, 2026

అక్షర యోధుడు అలిశెట్టి

image

కవిత్వంతో ప్రజల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతికొద్ది మంది కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. చిత్రకారుడిగా, ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తూనే కవిగా ఎదిగారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వాలు రాశారు. ‘ఎర్ర పావురాలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’, ‘సిటీలైఫ్’ వంటి కవితా సంకలనాలు రచించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. నేడు ఆయన జయంతి, వర్ధంతి(1956-1993).

News January 12, 2026

ICMR-NIIRNCDలో 45 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ICMR<<>>-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనబుల్ డిసీజెస్(NIIRNCD) 45 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 14 నుంచి 16వరకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, MBBS/BDS/BHMS/BAMS, BPT, BE/BTech, ME/MTech, ఇంటర్+ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: niirncd.icmr.org.in

News January 12, 2026

అత్తారింటికి కొత్తగా వెళ్తున్న కోడలు పాటించాల్సిన నియమాలు..

image

నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టిన తొలి 6 నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలో కోడలు ఓర్పుతో ఉండాలి. కుటుంబీకుల అలవాట్లను గమనిస్తూ వారితో మమేకం కావాలి. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఇష్టదైవానికి పాయసం నైవేద్యం పెట్టాలి. ఈ నియమం బాధ్యతలకే పరిమితం కాకుండా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. స్త్రీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, సామరస్యంగా జీవించడమే ఈ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం.