News January 31, 2025
కాపులుప్పాడలో ఉరేసుకుని యువకుడి మృతి

భీమునిపట్నం జోన్ కాపులుప్పాడ వైఎస్ఆర్ కాలనీలో యువకుడు ఉరేసుకుని మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అప్పులు బాధ తాళలేక సంతోశ్(25) ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు ఐ.ఎన్.ఎస్ కళింగలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 7, 2026
నేడు విశాఖ కోర్టుకుహాజరు కానున్న మంత్రి నారా లోకేష్..

మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు.ఓ దినపత్రికలో తనపై వచ్చిన ‘చినబాబు చిరుతిళ్లకు లక్షల ఖర్చు’ అనే కథనానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ ఇవాళ జరగనుంది. 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్షన్ కు ఆయన హాజరుకానున్నారు ఇప్పటికీ రెండుసార్లు ఆయన హాజరయ్యారు.
News January 7, 2026
విశాఖ: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా?

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరంలో నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఊరు వెళ్లేటప్పుడు LHMS సేవలు వాడాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాకింగ్‌కు వెళ్లే మహిళలు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పనివారి వివరాలు సేకరించాలని, వాహనాలకు విధిగా తాళాలు వేయాలని స్పష్టం చేశారు.
News January 7, 2026
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నల్లనయ్య

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్యను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


