News January 31, 2025
కామారెడ్డి: వచ్చే నెల 1న జాబ్‌మేళా

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వచ్చే నెల 1న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూధన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, SSC ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
Similar News
News September 15, 2025
కేసులు పెట్టినా వెనక్కి తగ్గం: మత్స్యకారులు

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. మమ్మల్ని ఉరితీసి చంపడంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
News September 15, 2025
రుషికొండ: సముద్రంలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

రుషికొండ బీచ్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పీఎం పాలెం ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయి శ్యామ్ మరో ఇద్దరు బీచ్‌లో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. ఇద్దరిని పోలీస్ గార్డ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం సంజయ్, సాయి శ్యామ్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News September 15, 2025
అనకాపల్లి: కాక రేపుతున్న బల్క్ డ్రగ్ పార్క్

అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాక రేపుతోంది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే ఈ ఇండస్ట్రీని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపిన 13 మందిపై నిన్న కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో ఈ పార్క్‌ను తూ.గో జిల్లాలో ఏర్పాటు చేయాలని చూడగా అక్కడ అడ్డుకున్నారని మత్స్యకారులు అంటున్నారు. దీంతో మత్స్య సంపద నాశనం అవుతుందని, తమ ఉనికే దెబ్బతింటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.