News January 31, 2025
ములుగు: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,076 మంది విద్యార్థులను గాను రూ.6,13,320 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News January 11, 2026
కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన ధీరుడు వడ్డే ఓబన్న

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న వీరోచిత పాత్ర పోషించారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు వడ్డే ఓబన్న. ఈయన నంద్యాల(D) సంజామలలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన 219వ జయంతి.
News January 11, 2026
కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన ధీరుడు వడ్డే ఓబన్న

నొస్పం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న వీరోచిత పాత్ర పోషించారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు వడ్డే ఓబన్న. ఈయన నంద్యాల(D) సంజామలలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన 219వ జయంతి.
News January 11, 2026
రామగుండం చేరుకున్న DCM భట్టి, మంత్రులు

గోదావరిఖనిలో జరిగే బహిరంగ సభకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ చేరుకున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, NTPC- ED చందన్ కుమార్ సమంతా, INTUC నేత జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.


